గౌరవ కర్నూలు జిల్లా SP గారి సూచనల మేరకు సైబర్ నేరాలు, మోసాల గురించి ప్రజలను అప్రమత్తము చేసి, వారికి అవగాహన కల్పించేందుకు కరపత్రాలను (pamplets) హోలగుంద పోలీస్ స్టేషన్ నందు SI బాల నరసింహులు గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమమునకు హోలగుంద ZP High school, కన్నడ స్కూల్, తనూజ డిగ్రీ కాలేజ్, సుమౌర్య డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు, పోలీసు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరాలు జరిగే విధానం గురించి అవగాహన కలిగి ఉండాలని, అపరిచితుల నుండి వచ్చే వీడియో కాల్స్ కానీ, .apk లింకులకు కానీ రిసీవ్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎవరికి కూడా మన వ్యక్తిగత వివరాలు బ్యాంకు సంబంధించిన వివరాలు చెప్పకూడదని తెలియజేయడమైనది. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 నంబరు, పోలీస్ వారికి కాల్ చేసి తగిన సహాయం పొందాలని తెలియజేయడమైనది.
సైబర్ నేరాలుపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలను ఆవిష్కరించిన SI బాల నరసింహులు
RELATED ARTICLES