Thursday, January 16, 2025

సైకాలజిస్ట్ అసోసియేషన్ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరణ

సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి.
తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరి రామచంద్రం తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సైన్స్ సెంటర్ హనుమకొండ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేసి టి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరి రామచంద్రం మాట్లాడుతూ తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు పరీక్షలపై విజయాలు, పదవ తరగతి ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థులు  ఆందోళన గురి కాకుండా ఉండడానికి  మెటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు, కోవిడ్ టైంలో ఆన్లైన్ కౌన్సిలింగ్, ఆత్మహత్యల నివారణ కోసం సమస్యల పరిష్కార మార్గాలు, కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు, సాధించిన విజయాలు ఇంకా ముందు జరిగే శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, మెంటల్ హెల్త్ క్యాంపు ఏర్పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక సైకాలజిస్ట్ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల లో ఒక సైకాలజిస్ట్ ఉండేటట్టుగా ప్రభుత్వం కృషి చేయాలి అన్నారు సమాజంలో ప్రజల మార్పు మానసికంగా అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు అనేక ప్రజలకు సేవ చేసే అవకాశం టి పి ఏ కృషి చేస్తున్నమని కోరారు. ఈ కార్యక్రమంలో టీ పీ ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పరికిపండ్ల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళీధర్ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మితున్ గౌడ్, జిల్లా కార్యదర్శి బొజ్జ సురేశ్, హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ శివుడు,కంచు అపర్ణ, కంచు ప్రభాకర్,దామోదర్, కళ్యాణి,పవిత్ర దేవి, సునీత, నాగలక్ష్మి, గోవర్ధన్, శ్రీనివాస్, కనుక చారి, డాక్టర్ ఎల్ శంకర్, శ్రీనివాస్, కుమారస్వామి, టీపీ ఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular