హిందూపురం పట్టణంలోని బెంగళూరు రోడ్డు నందు “శ్రీ శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవ” కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి “T N దీపిక” ఎంపీ అభ్యర్థి “బోయ శాంతమ్మ”
T N దీపిక, శాంతమ్మ వారు మాట్లాడుతూ
శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవముకు ముందుగా మండలం 48 రోజులు అర్ధమండలం 24 రోజులు మరియు మహిళలు 11 రోజులు వీరందరూ ప్రతిరోజు ఒక్కపూట భోజనముతో మాల ధారణ ధరించి రథోత్సవ కార్యక్రమంలో ఇనుప కొండీలతో రథాన్ని లాగారు. ఇరువైపులా ఇనుపకంబిలతో నోటికి తాళం వేసుకొని కొందరు మరికొందరు వీపున ఇనుప కొక్కిలను తగిలించుకొని నెమలి వలె ఉయ్యాల ఊగే వారు కొందరు ఇలా ప్రతి భక్తుడు తమకు తోచిన విధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవానికి వీరందరూ నెమలి వలే నాట్యం చేసుకుంటూ వారి భక్తిని చాటుకున్నారు.
నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు,వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.