నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో బుధవారం మాజీ జెడ్పిటిసి చీకోటి జయ ప్రదీప్ సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిరుపేద ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమించడమే కాకుండా దశల వారీగా ఆయా శాఖలతో సమీక్ష సమావేశాలు నిర్వహించి. గ్రామాల వారీగా సమస్యలు తెలుసుకుంటు అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. మండలంలోని పలు గ్రామాలలో సిసి రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యేతో మండల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. సుల్తాన్ నగర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులు పూర్తయితే చాలావరకు సమస్య తీరుతుందని విడతల వారీగా మండలంలోని ప్రతి గ్రామంలో సిసి రోడ్డు పూర్తి చేసుకుని మట్టి రోడ్డు లేకుండా తయారు చేసుకుందామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకుల షేక్ జమాల్,కూర్మ సాయిలు,వడ్ల బ్రహ్మం,షేక్ అహ్మద్,హుసేని, సుధా,రాము రాథోడ్,చాంద్ పాషా,ప్రజా పండరి,అనీస్ పటేల్,మల్లయ్య గారి,ఆకాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.