


TEJA NEWS TV ALLAGADDA
రిపోర్టర్ P. శ్రీధర్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని అభిరుచి హోటల్ నుండి సెయింట్ ఆన్స్ స్కూల్ వరకు నూతనంగా నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నింటిని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం క్షేత్రాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు గాను రూ.25 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే అఖిలప్రియ తెలిపారు.
వైసిపి నాయకులకు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కళ్లకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలనుంటిని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వివరించారు.
సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద విద్యార్థులు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తాము గుర్తించి గతంలోనే రోడ్డు మంజూరు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.