కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ, *”ఒక సీసీ కెమెరా వంద పోలీసులకు సమానం”* అన్నారు. కాలనీల్లో గ్రూపులుగా ఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలను నివారించవచ్చని సూచించారు.
ఈ నెల 4న రుద్రంపూర్ నాలా ఏరియాలోని సింగరేణి ఉద్యోగి వాకపల్లి వెంకటరమణ ఇంట్లో జరిగిన చోరీ కేసును చేధించినట్లు వెల్లడించారు. వాహనాల తనిఖీ సమయంలో లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామవరం గ్రామానికి చెందిన నారసాని రమేశ్, కొత్తగూడెం మున్సిపాలిటీ మేదర బస్తి గొల్లగూడెంకు చెందిన ఓర్సు కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సోదాలో 3.5 తులాల బంగారు ఆభరణాలు, రూ. 25,000 నగదు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇవి రుద్రంపూర్ దొంగతనానికి సంబంధించినవని విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు.
ప్రతి ఇంటి ముందు, వీధి మూలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా నేరాలను ముందుగానే గుర్తించి అడ్డుకోవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సీసీ కెమెరాలు నేరాల నివారణకు అద్భుత ఆయుధం – డీఎస్పీ అబ్దుల్ రెహమాన్
RELATED ARTICLES



