TEJA NEWS TV : తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న గౌరీ శంకర్ రావు ఇటీవలే డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన సందర్భంగా ఆయన సోమవారం తాడేపల్లి కాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని గౌరవ పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి కల్పించిన సందర్భంగా సీఎం జగన్ కు జ్ఞాపికను అందజేసి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన మీరు ప్రజల కోసం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు,ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు అందజేయడంలో ప్రత్యేక చోరవ చూపాలని చూసించినట్టు తహశీల్దారు గౌరీ శంకర్ తెలిపారు.
సీఎం జగన్ ను కలసిన తహశీల్దారు గౌరీశంకర్ రావు
RELATED ARTICLES