వరదయ్యపాలెం మండల ప్రజలు కోసం ప్రిన్సీ డిజిటల్స్ లక్ష్మి పురం నందు ఉచితంగా దరఖాస్తు చేయబడును. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము
గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడానికి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సి.ఎస్.సి జిల్లా మేనేజర్ సతీష్ తెలిపారు.ఈ పథకాన్ని ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారన్నారు. ఈ పథకం ద్వారా ఇళ్లపై కప్పులపై సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీ ఇస్తారు. సోలార్ ప్యానళ్ళ ఖర్చులో 40 శాతం వరకు సబ్సిడీ వర్తిస్తుంది అన్నారు. ఈ పథకం ద్వారా ఇళ్లకు ఉచిత విద్యుత్ అందుతుందని ప్రభుత్వానికి విద్యుత్ ఖర్చులు తగ్గుతాయని పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్ల అమరిక ద్వారా నెలకు 300 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, వినియోగదారుడు విద్యుత్ వినియోగించుకోగా మిగిలిన విద్యుత్తును గ్రిడ్ కు అమ్ముకోవచ్చునని తెలిపారు. ఈ పథకం ద్వారా ఉచిత విద్యుత్ తో పాటు మిగులు విద్యుత్ వల్ల అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. సొంత భవనం కలిగిన ఎవరైనా పిఎం సూర్యఘర్ పథకంలో ముందుగా సి.ఎస్.సి సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తు చేసుకోవాలనుకున్నవారు తమ ఇంటి మీద పై స్లాట్ భాగం ఫోటో తీసి ప్రస్తుతం ఉన్న విద్యుత్ బిల్లుతో సి.ఎస్.సి కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. పూర్తి వివరముల కొరకు సి.ఎస్.సి కేంద్రం నందు సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలియజేశారు.మరిన్ని వివరాలకు ప్రిన్సీ డిజిటల్స్ కామన్ సర్వీస్ సెంటర్ వి ఎల్ ఈ ఎలియాజర్ పల్లిపట్టు ను 9003064740 నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు
సి ఎస్ సి సెంటర్లలో పీ.ఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ రిజిస్ట్రేషన్ -ఎలియాజర్ పల్లిపట్టు
RELATED ARTICLES