TEJA NEWS TV TELANGANA :హైదరాబాద్, ఆగస్టు 24:
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ రచించిన “లెగసీ & లాయల్టీ – 45 ఇయర్స్ విత్ కాంగ్రెస్ పార్టీ” పుస్తకాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో శనివారం రాత్రి ఆవిష్కరించారు.
ఈ వేడుకలో రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో మహమ్మద్ అలీ షబ్బీర్ గారి 45 ఏళ్ల సేవలను ప్రముఖ నాయకులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో మల్లు భట్టి విక్రమార్క, AICC తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, TPCC అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజ నరసింహ, జూపల్లి కృష్ణారావు, కోమట్రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతో పాటు అనేక మంది హాజరయ్యారు.
అలాగే సీతక్క, కొండా సురేఖ, జి. వివేక్, శ్రీహరి, కె. జానా రెడ్డి, డాక్టర్ జె. గీతారెడ్డి, డాక్టర్ కె. కేశవరావు, బలరాం నాయక్, అంజన్ కుమార్ యాదవ్ తదితర సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు.
లెగసీ & లాయల్టీ పుస్తకం ద్వారా కాంగ్రెస్ పార్టీతో తన నాలుగు దశాబ్దాల అనుభవాలను, విశ్వాసాన్ని, రాజకీయ ప్రయాణాన్ని మహమ్మద్ అలీ షబ్బీర్ పాఠకులకు అందించారు.



