TEJA NEWS TV
హోలగుంద మండలం
సావిత్రిబాయి పూలే మహిళల స్వేచ్ఛ సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారని ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు సిహెచ్ నాగరాజు కొని ఆడారు మండల కేంద్రమైన హోళగుందలో సీజనల్ హాస్టల్ నందు ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సావిత్రిబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళల హక్కులు విద్యను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు మహిళా ఉపాధ్యాయురాలిగా బాలికలకు అనగారిన వర్గాల వారికి విద్య అవకాశాలు కల్పించేందుకు ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా మహిళల స్వేచ్ఛ సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు జనవరి 3 ,1831న సావిత్రిబాయి పూలే జన్మించారన్నారు అంతకుముందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యకర్తలు సోహన్, దుర్గయ్య, బుడగ జంగాల నాయకులు రామాంజనేయులు ధూపం అంబులు సమ్మతిగేరి నాగరాజు మహిళల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది .
సావిత్రిబాయి పూలే మహిళల స్వేచ్ఛ సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారు.సావిత్రిబాయి పూలే
RELATED ARTICLES