బుచ్చిరెడ్డిపాళెం 14 ఏప్రిల్ తేజన్యూస్ టీవీ
సామాజిక సమరసతా వేదిక బుచ్చిరెడ్డిపాలెం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ గోపాలకృష్ణయ్య పాఠశాల నుండి ర్యాలీగా బయలుదేరి హరిజనవాడలోని అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లి ముందుగా వేదిక సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో అలంకరించారు. అక్కడివారినీ ఉద్దేశించి వేదిక గౌరవ అధ్యక్షులు పనితి వెంకటరమణయ్య మాట్లాడుతూ విద్యా తో ప్రపంచాన్ని మార్చవచ్చని బ డుగుల జీవితంలో మార్పు తేవచ్చినిని అంబేద్కర్ నిరూపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదిక కార్యదర్శి రాయపూడి శరత్ బాబు, గండికోట సుదీర్ , కన్వీనర్ ఇనుగురూ సుబ్బారావు,కాకి శ్రీనివాసులు, నేలనూతల శ్రీధర్, విద్యార్థులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
