కడప జిల్లా రాజంపేట నియోజవర్గం సిద్దవటం మండల పరిషత్ కార్యాలయములో జాతీయ ఉపాధి హామీ పధకం 17వ సమాజిక తనిఖీ కోఆర్డినేషన్ సమావేశము జరిగినది. ఈ తనిఖీ నేటి నుండి ప్రారంభించి వారం రోజుల పాటు అన్ని గ్రామ పంచాయతీలలో డిఆర్పీల అధ్వర్యంలో జరుగును. ఈ తనిఖీ జరుగు సమయంలో ఫీల్డ్ ఆసిస్టెంట్లు అన్ని పనులను తనిఖీ సిబ్బంది చూపాలని వారు అడిగిన సమాచారం ఇవ్వాలని జిల్లా విజిలెన్స్ అధికారి యోగాంజులరెడ్డి సూచించారు. అలాగే ఎంపిడిఓ జవహార్ బాబు మాట్లాడుతూ తనిఖీ సమాచారం స్థానిక ప్రజాప్రతినిధులకు తెలపాలని గ్రామసభలు సర్పంచుల అధ్వర్యంలో జరపాలని కోరారు. ఈ కార్యక్రమములో ఎస్సార్పీ లక్ష్మీ నారాయణ ఇఓఇర్డీ పులిరామ్ సింగ్ ఎఇ పిఒర్ సుబ్రహ్మణ్యం ఎపిఓలు నరశింహులు శివశంకర రెడ్డిలు ఇసి శీరీష డిఆర్పిలు టిఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ సమావేశము లో పాల్గోన్నారు.
సామాజిక తనిఖీ కోఆర్డినేషన్ సమావేశం
RELATED ARTICLES