Monday, January 20, 2025

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోని రెవెన్యూ అధికారులు

TEJA NEWS TV Alagadda:

అడ్డగోలుగా ఆన్లైన్లో మార్పులు చేసిన తాసిల్దార్

అవకాశంగా తీసుకున్న జిల్లా ఎండోమెంట్ శాఖ అధికారులు

విచారణ చేపట్టి న్యాయం చేయండి కలెక్టర్ గారు

ఆళ్లగడ్డ న్యూస్:

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం తుంగలో తొక్కి నిబంధనలకు విరుద్ధంగా రెవిన్యూ రికార్డుల ఆన్లైన్ లో మార్పులు చేసిన రుద్రవరం తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలని ఆలమూరు వీరబ్రహ్మం మఠం 5వ పిఠాధిపతిగా సేవలందిస్తున్న అశోక్ కుమార్ ఊరఫ్ జగదేవ్ స్వామి అధికారులను కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని రుద్రవరం మండలం ఆలమూరు గ్రామం అలాగే నరసాపురం గ్రామాలలోని భూములు. మా పూర్వీకులు మా అబ్బా గారైన మఠం శేషయ్య కుమారుడు వీరబ్రహ్మంమరియు పోతులూరి వీరబ్రహ్మం వీరు నుండి మాకు సంక్రమించిందని దీనికి సంబంధించిన 1940 సంవత్సరం నుండి కట్టిన పన్ను రసీదులు అలాగే పట్టాదార్ పాస్ పుస్తకాలు. ఆర్ ఓ ఆర్ రికార్డులు. అడంగల్ మాన్యువల్ ఈసీలు తదితర రికార్డులలో మా పూర్వీకుల పేర్లు పొందు పరిచి ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు కూడా సాగు లో ఉన్నాము. ఆలమూరు గ్రామంలో మా పూర్వీకులు నిర్మించిన వీరబ్రహ్మం మఠం మా పూర్వీకుల ఆస్తిగా భావించి మా సొంత ఖర్చులతో ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి అర్పిస్తూ వస్తున్నామని తెలిపారు రెవిన్యూ అధికారుల తప్పిదాల వల్ల ఆలమూరు గ్రామంలో ఉన్న వీర బ్రహ్మం మఠం కడప జిల్లాలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఆధీనంలో ఉందని మాకు నోటీసులు ఇచ్చారు.ఈ విషయమై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా పర్మినెంట్ ఇంజక్షన్ ఆర్డర్ మంజూరు చేసి గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా జడ్జి మరియు కడప జిల్లాలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం కంది మల్లయ్య పల్లె వారికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గౌరవ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఖాతారు చేయకుండా అప్పటిరుద్రవరం మండల తాసిల్దార్ మల్లికార్జున ఆన్లైన్ రికార్డులను తారుమారు చేసి వీరబ్రహ్మం మఠం గారి పేరున రికార్డులను పొందుపరి జిల్లా ఎండోమెంట్ శాఖకు పంపించారు. వీటిలోని వాస్తవాలను తెలుసుకోకుండా అధికారుల మెప్పుకోసం జిల్లా ఎండోమెంట్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులు ఏకంగా కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం పేరున ఉంది అంటూ తెలుపుతూ తాలూకా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి పంపించి ఉన్నారు. రుద్రవరం అప్పటి తాసిల్దార్ మల్లికార్జున మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా అప్పటి ఎండోమెంట్ శాఖ అధికారుల తప్పిదాల వల్ల మాకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆలమూరులోని వీర బ్రహ్మం మఠం మరియు మా పూర్వీకులకు సంబంధించిన భూముల తాలూకు ఆస్తులు మాకు చెందాలని దీనిపైన విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఉన్నతాధికారులు మాకు న్యాయం చేసి సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular