Tuesday, June 17, 2025

సర్కారు దవాఖానాలో కుంటుపడుతున్న వైద్య సేవలు

బీబీపేట మండల కేంద్రంలోని సర్కారు దవాఖానాలో వైద్య సేవలు ఉదయం 10 తర్వాతనే నిర్వహిస్తున్న బీబీపేట ప్రాథమిక ఆసుపత్రి సిబ్బంది  సుమారు మండలంలోని 11 గ్రామాల ప్రజలకు ఎల్లవేళలా వైద్య సేవలు అందించాలని దృక్పథంతో అప్పటి కాంగ్రెస్ హయాంలో ఆసుపత్రిని నిర్మించారు కాగా అట్టి ఆసుపత్రిలో సేవలు మాత్రం నామమాత్రకంగానే జరుగుతున్నాయనే వాదన మండల ప్రజల మనసులో ఉంది. దానికి తోడు గత సంవత్సరం బదిలీ అయినా ఉద్యోగుల పేర్లను అలాగే ఉంచి కనీసం ప్రస్తుతం ఆసుపత్రిలో ఎవరెవరు పని చేస్తున్నారు వారి పేర్లను నమోదు చేయకపోవడం ఆసుపత్రి ఉన్నతాధికారికే చెల్లింది. కాగా మంగళవారం ఉదయం మండల వైద్యాధికారిణి కి చరవాణి ద్వారా మీ సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, ఆస్పత్రి ప్రాంగణం ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్నటువంటి పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియ, ఆస్పత్రిలో పరిశుభ్రత వంటి వాటిపై  మీరు ఎలాంటి చర్యలు చేపడతారని  అడగగా అట్టి వారిపై  తాము చర్యలు తీసుకుంటామని చెప్పకపోగా మీరు వార్తలు ఏమైనా ఉంటే రాసుకోండి అంటూ ఆమె ఇచ్చిన సమాధానం పత్రికా విలేకరులను ఆశ్చర్యానికి గురి చేసింది . ఇకనైనా ఉన్నతాధికారులు కలగజేసుకొని ఆసుపత్రిలో సరియైన నీటి వసతి, పరిశుభ్రత రోగుల పట్ల వైద్య సిబ్బంది ప్రవర్తన సమయపాలన వంటి వాటిపై తక్షణ చర్యలు చేపడుతారని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular