
TEJA NEWS TV : రాష్ట్రస్థాయి రబ్బి బాల్ పోటీలను లాంఛనంగా ప్రారంభించిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం
ప్రజాభూమి బి ఎన్ కండ్రిగ
బుచ్చినాయుడు కండ్రిగా మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల లో రాష్ట్రస్థాయి రబ్బి బాల్ పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టు ఎంపిక క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అదే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని దీనికి కావాల్సిన పూర్తి సహకారం ప్రభుత్వం చే విద్యార్థులకు క్రీడాకారులకు అందుతుందని తెలిపారు…
క్రీడాకారులను ప్రోత్సహిస్తూ బుచ్చినాయుడు కండ్రిగ లో జరుగుతున్న క్రీడా పోటీలలో పాల్గొంటున్న విద్యార్థులకు స్పోర్ట్స్ టి షర్ట్స్ యూనిఫామ్ అందించిన దాత వరదయ్యపాలెం మండలం అంబూరు గ్రామానికి చెందిన ఎన్నారై నందకిషోర్. ను సన్మానించి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఆదిమూలం వైసీపీ నాయకులు, పాఠశాల సిబ్బంది…
ఆకట్టుకున్న యోగ ప్రదర్శన
బుచ్చినాయుడు కండ్రిగ లోని జెడ్పి పాఠశాలలో ఈరోజు జరుగుతున్న క్రీడా పోటీల కార్యక్రమంలో శ్రీకాళహస్తి కి చెందిన పదవ తరగతి విద్యార్థిని శివాని యోగా ప్రదర్శన ఆకట్టుకుంది….
శివాని ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం చే క్రీడా విభాగం లో ఉత్తమ యోగ ప్రదర్శన అవార్డును అందుకుంది.ఆమెను ఎమ్మెల్యే ఆదిమూలం ఘనంగా సన్మానించారు