సత్యవేడు నియోజకవర్గ స్థాయి ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంను శనివారం ఏర్పాటు చేశారు.
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో శనివారం నియోజకవర్గస్థాయి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సమావేశమై ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేశారు….
ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా SA.నయీమ్,(NTV), గౌరవ అధ్యక్షులుగా_ విజయ రెడ్డి,ఉపాధ్యక్షులు_మాణిక్యం రెడ్డి, విజయ్ కుమార్, జనరల్ సెక్రెటరీగా సురేష్, (HM TV), సంయుక్త కార్యదర్శులుగా కాతారి ప్రశాంత్ (Raj news) ,శరవణ, కోశాధికారిగా v. పవన్ /బాబు, అధికార ప్రతినిధిగా సలీం ఎన్నిక కాగా..సభ్యులుగా అయ్యప్ప, రాజా, కార్తీక్, అశోక్, సుబ్బు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు SA.నయీమ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని వీడియో జర్నలిస్టులను అందరిని ప్రస్తుతం ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రెస్ క్లబ్లో చేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ క్లబ్లో విధంగా నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను ప్రెస్ క్లబ్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీ సురేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆయా మండలాలలోని వీడియో జర్నలిస్టులు అందరూ ఒకే వేదికపై రావాలని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశామని ఈ ప్రెస్ క్లబ్ ద్వారా జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించుకుంటామని తెలిపారు.
సత్యవేడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏర్పాటు
RELATED ARTICLES