వరదయ్యపాలెం ఏప్రిల్ 27 ( తేజన్యూస్ టీవీ )
మండలంలోని సంతవేలూరులో వడదెబ్బకు గురై తొట్టంబేడు చెంగయ్య (61) చికిత్స పొందుతూ మృతి చెందాడు.గత సోమవారం గ్రామంలో ఉపాధి కూలీ పనులకు వెళ్లిన చెంగయ్య హఠాత్తుగా స్పృహ తప్పి కుప్పకూలిపడ్డాడు.దీంతో అతనిని సుళ్లురుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.మృతి చెందిన చెంగయ్యను ఉపాధి జేఈ, పంచాయతీ కార్యదర్శి హబీబ్, వీఆర్వో మోహన్ పరిశీలించి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు
సంతవేలూరులో వడదెబ్బతో వృద్ధుని మృతి
RELATED ARTICLES