*తేజ న్యూస్ టివి ప్రతినిధి.*
సంగెం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు తిమ్మాపురం గ్రామానికి చెందిన దాత నూర సుహాసిని రమేశ్, ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు, స్కేల్, తదితర ఇతర సామాగ్రి మెటీరియల్ విస్తరణ చేశారు.సోమవారం రోజున పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు స్టేషనరీ ,మెటీరియల్ అందించడం చాలా సంతోషకరమని విషయమని అదే విధంగా స్ఫూర్తిదాయకమని, విద్యార్థులు పరీక్షలు మెరుగైన ఫలితాలు సాధించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రవీందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పి సుధాకర్, డి శ్యామ్ కుమార్, పి ఆనంద్, ఏ వెంకటేశ్వర్లు, పి శ్రీనివాస్, టి కిరణ్ కుమార్, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సంగెం: విద్యార్థులు పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించాలే..గ్రామ దాత నూర సుహాసిని-రమేష్
RELATED ARTICLES