తేజ న్యూస్ టివి ప్రతినిధి
సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో శనివారం రోజు అనారోగ్యంతో మృతి చెందిన కొనకటి రామక్క,వడ్డె మొగిలి పార్ధీవ దేహాలను సందర్శించి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవలే అనారోగ్య కారణాలతో మృతి చెందిన వడ్డేపల్లి మనోజ్ కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. ఈ సందర్భంగా మనోజ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.అనంతరం అతని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికీ అండగా వుంటుంది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు పసునూరి సారంగపాణి,స్థానిక బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.