TEJA NEWS TV :
తేజ న్యూస్ టివి ప్రతినిధి
సంగెం మండల కేంద్రంలోని మహిళా మండల బుధవారం రోజు మహిళా స్త్రీ శక్తి పధకం మహిళా మండలి కార్యాలయంలో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి మాట్లాడుతు రాష్ట్రం ప్రభుత్వం మహిళాసాధికారతకు మహిళశక్తి పథకం ప్రవేశపెట్టింది,దీనిని అర్హత ఉన్న మహిళలకు గుర్తించి వ్యాపారరంగంలో రాణించేలా తగువిదమైన నైపుణ్యాలను మెరుగుపరుస్తూ,వ్యాపార మెలకువలు నేర్పిస్తూ తద్వారా వ్యాపారరంగంలో రాణించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని తెలిపారు. స్వయం సహాయక బృందం మహిళకు ఎలాంటి ప్రీమియం లేకుండా లోన్ భీమలో రెండు లక్షల వరకు మరియు ప్రమాద భీమలో 10 ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పిస్తుందని తెలిపారు
వివిధ రకాల మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేసుకునేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనితెలిపారు. వ్యవసాయంతో పాటు అనుబంధంగా అదనపు ఆదాయం కోసం పాల దిగుబడిని పెంచుటకు
డైరీ లబ్ధిదారులను గుర్తించాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంతంలో మేలుజాతి పెరటి కోళ్లకు మంచి డిమాండ్ ఉన్నందున ఆసక్తి ఉన్న లబ్ధిదారులను గుతించాలని తెలిపారు , మరియు మదర్ యూనిట్కు లబ్ధిదారుల ఎంపిక చేయాలని తెలిపారు
మిల్క్ పార్లర్ కు ఒక బెనెఫిషరీస్
సకాలంలో పూర్తి చేయగలరు,అని అన్నారు.
ఈకార్యక్రమంలో జడ్పీటీసీ సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీ మల్లయ్య, యూబీఐ మేనేజర్ అనిల్ ఏపీఎం కిషన్, మండల సమాఖ్య కార్యదర్శి రాజమని,కోశాధికారి రేణుక సీసీ లు రాజయ్య కుమార స్వామి,ఎలియా,కృష్ణమూర్తి,స్వరూప ఎమ్ ఎస్ ఎ,సుజాత కృష్ణ విఓఎ, కృష్ణవేణి, విజయ, మంజుల, పాల్గొన్నారు.