Monday, April 28, 2025

సంగెం మండల కేంద్రంలో శాంతి మండల సమాఖ్య

తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.



శాంతి మండల సమాఖ్య సంగెం ఆఫీస్ లో మాడల్ సిఎల్ఎఫ్ పై మరియు మండల్ రిసోర్స్ సెంటర్ ఏర్పాటు గూర్చి  సెర్ఫ్ హైదరాబాద్ కార్యాలయం నుండి సంస్థాగత నిర్మాణం డైరెక్టర్ నవీన్  పాల్గొన్నారు . మండలంలో శాంతి మండల సమైక్యను మండల్ రిసోర్స్ సెంటర్ గా మార్చుటకు ఆఫీస్ పరిసరాలను పరిశీలించడం జరిగింది, అదేవిధంగా శాంతి మండల సమాఖ్య నెలవారి ఈసీ సమావేశంలో పాల్గొని మహిళలకు ప్రభుత్వం అధిక ప్రాముఖ్యత ఇస్తుందని తెలిపారు, స్కూల్ యూనిఫామ్స్, పాఠశాలల అభివృద్ధికి అమ్మ ఆదర్శ పాఠశాల కమీటీలకు చైర్పర్సన్ గా నియమించిందని తెలిపారు, మహిళలు నైపుణ్య అభివృద్ధి చేసుకుంటూ  వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు , ఉన్న వ్యాపారాలను కాకుండా అవసరాలకు అనుగుణమైన కొత్త వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని వ్యాపారంలో రాణించాలని తద్వారానే మహిళలు ధనవంతులు  కోటీశ్వరులు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ తక్కల్లపల్లి రవీందర్ రావు  మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని, అదేవిధంగా విద్యార్థులకు మంచి బోధన వసతులు ఏర్పాటు చేయాలని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా కృషి చేయాలని అధ్యక్షులను కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్ డిఓ రేణుకా దేవి  మాట్లాడుతూ   శాంతి  మండల సమాఖ్య లోని మహిళలందరూ సంఘటితంగా జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఎం లు దయాకర్, సరిత, భవాని , చంద్రశేఖర్, ఏపిఎం కిషన్ సీసీలు కుమారస్వామి, సంపత్, కృష్ణమూర్తి, రాజయ్య ,ఏలియా, సురేష్ అధ్యక్షురాలు కళ్యాణి కార్యదర్శి రాజమణి కోశాధికారి రేణుక ఆఫీస్ స్టాఫ్ సుజాత కృష్ణ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular