తెలంగాణ రాష్ట్ర సాధకుడు,తొలి ముఖ్యమంత్రి కెసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలను సంగెం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన *జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డిమాట్లాడుతూ స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు,తెలంగాణని బంగారు తెలంగాణగా తయారు చేసిన ఒకే ఒక్కడు మన కేసీఆర్ అని అన్నారు.
మండల రైతు బంధు కన్వీనర్ కందగట్ల నరహరి, మాట్లాడుతూ ఏర్రలు బారిన నేలలకు కాళేశ్వరంతో పచ్చగా మార్చి రైతులను రాజులు చేసిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య,తాజా మాజీ సర్పంచులు గుండేటి బాబు,కక్కేర్ల కుమారస్వామి,గన్ను శారద సంపత్,వాసం రజిత సాంబయ్య,ఎంపీటీసీలు మెట్టుపెల్లి మల్లయ్య,రంగరాజు నరసింహస్వామి,కట్ల సుమలత నరేష్,మండల సీనియర్ నాయకులు దోపతి సమ్మయ్య, కోడూరి సదయ్య,కడుదూరి సంపత్, కాగితాల జగన్నాథ చారి,సంగెం తాజా మాజీ ఉప సర్పంచ్ కక్కేర్ల శరత్,మండల యూత్ అద్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి,ఎస్సీ సెల్ అద్యక్షుడు చిర్రా రాజు కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ పోశాల ప్రవీణ్,వివిధ గ్రామాల అధ్యక్షులు ఎండీ మైనుద్ధిన్,పూరం శ్రీనివాస్,యూత్ ఉపాధ్యక్షులు న్యాల అశోక్ యాదవ్,చిర్ర సాంబరాజు,చిర్ర రాజు,చిర్ర ప్రకాష్, గుగులోతు వెంకటేష్,వర్కాల రవి,కృష్ణ ప్రసాద్,రమేష్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES