తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పసునూరి సారంగపాణి ఆధ్వర్యంలో సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 71 వ సం,, జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి కేసీఆర్ కి సంగెం మండల ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు..
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు,మండల ప్రధాన కార్యదర్శి జక్క మల్లయ్య,జిల్లా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పులుగు సాగర్ రెడ్డి,సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి,మాజీ ఎంపీపీ కక్కెర్ల సదానందం, మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుండేటి బాబు,మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు, జిల్లా, మండల నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సంగెం మండల కేంద్రంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES