తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆదివారం రోజు సంగెం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి జెండా ఆవిష్కరించడం జరిగింది,
ఎంపీపీ కందగట్ల కళావతిమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలు వెలకట్ట లేనివని అన్నారు. ఉద్యమకారులెందరో తమ ప్రాణాలను సైతం రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని కొనియాడారు. మన ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి ఫలాలను అందరికీ అందేలా చూడటమే ఈ ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు .
కార్యక్రమంలో మండల తసిల్దార్ రాజకుమార్ ,సంగెం ఎస్ఐ, నరేష్ ,మండల ఎంపీటీసీలు మెట్టిపల్లి మల్లయ్య,అడ్డగట్ల దుర్గారావు,గుగులోతు వీరమ్మ , కట్ల సుమలత నరేష్, చిదిరాల రజిత రాజు , బొమ్మ పావని,ఐబి ఏఈ సత్య సాయి, ఏపీఎం కిషన్, ఎంపీడీఓ ఆఫీస్ స్టాఫ్ , ఈజీఎస్ స్టాఫ్ , మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సంగెం మండల కార్యాలయం లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
RELATED ARTICLES