*శ్రీరామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సంగెం ఎంపీపీ దంపతులు*
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
భారతీయులందరు పరమ పవిత్రమైన రోజుగా భావించే శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవము అంగరంగ వైభవంగా వాయిద్యాలతో సన్నాయిలతో పూలమాలలతో సంగెం మండలం కేంద్రంలోని హనుమాన్ గుడి వద్ద ఘనంగా నిర్వహించారు. రాముడి తరపున సంగెం మండలం యం.పి.పీ కందగట్ల కళావతి నరహరి దంపతులు, సీతమ్మ తరపున సంగెం యం.పి.టి.సీ మెట్టుపల్లి మల్లయ్య దంపతులు, గంగుల శ్రీనివాస్ దంపతులు కూర్చుని కళ్యాణాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి మాట్లాడుతూ సీతా రామచంద్రుల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఐదు వందల సంవత్సరాల భారతీయుల కల అయిన అయోధ్య లో భవ్య రామ్ మందిరం నిర్మాణం జరుగడం శుభపరిణామం అని అన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ ఆగపాటి రాజ్ కుమార్, ఉండీల మల్లి కార్జున్, ఆగపాటి రామకృష్ణ, మునుకుంట్ల మధుకర్ లతో పాటు గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, సంగెం మండలం లో ని వివిధ గ్రామాల నుండి దాదాపు ఐదు వందల మంది భక్తులు పాల్గొన్నారు.
సంగెం మండలం కేంద్రంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
RELATED ARTICLES