ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా సంగెం పోలీస్ స్టేషన్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొలేటి మాధవ రెడ్డి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం పరకాల నియోజకవర్గంలో ఎం పనులు చేసిందో ప్రజలు గమనించారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ని అలా అనడం సరైన పద్ధతి కాదని మీరు మాట్లాడే మాటలు ఒక్క సారి వెనక్కి తిరిగి వింటే మీకే తెలుస్తోంది అని అన్నారు. మరియు పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి జనగాం రమేష్ , గూగులోత్ రవీందర్ నాయక్ డిసిసి ఎస్టీసెల్ చైర్మన్ , ఆగపాటి రాజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అచ్చ నాగరాజు మండల కిషన్ సేల్ అధ్యక్షులు పోతుల ప్రభాకర్ ఉపాధ్యక్షులు కరోజు గుప్త గోపాల్ , కంది గొట్ట జనార్ధన్ చారి ,భోగి రవి, బోనాల కిషన్ హోలీ సాంబయ్య బానోతు తిరుపతి నాయక్ ,ఆధ్వర్యంలో ఫిర్యా దు చేశారు. సీఎం స్థాయి వ్యక్తిని తిట్టడం సరికాదని, వెంటనే కేటీఆర్ పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సంగెం పోలీసు స్టేషన్ లో మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు పై కేసు నమోదు
RELATED ARTICLES