*పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ చల్లా…*
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలంలోని మొండ్రాయి,నార్లవాయి,తిమ్మాపూర్ గ్రామాల్లో ఇటీవలే వివిధ కారాణాలతో మృతిచెందిన దామెరుప్పుల సారయ్య,చల్లా రామక్క,రొట్టె లచ్చమ్మ,బండారి చంద్రకళ కుటుంబ సభ్యులను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల
వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారి మృతికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి బిఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు.ఆయన వెంట పరామర్శించిన వారిలో సంగెం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసునూరి సారంగపాణి, సంగెం సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సంగెం : పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ చల్లా
RELATED ARTICLES