
తేజ న్యూస్ టివి, సంగెం.
సంగెం మండలం షాపూర్ గ్రామంలో రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని మంద కృష్ణ మాదిగ ఆవిష్కరించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ” డా.బి ఆర్ అంబేద్కర్ తన జీవితం కాలం పోరాడి అణగారిన వర్గాలకు ఎన్నో హక్కులు సాధించి పెట్టాడు.ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని రచించాడు.కానీ ఇన్నేళ్లు దేశాన్ని పాలించిన పాలకులు రాజ్యాంగ ఫలాలు క్రింద కులాల దాకా తీసుకురావడంలో విఫలమయ్యారని అన్నారు.అంబేద్కర్ ఆశించిన విధంగా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందలేదు.ఎస్సీ వర్గీకరణ ద్వారా అన్ని కులాలకు రిజర్వేషన్ల అందించి అంబేద్కర్ ఆశయాన్ని ఎమ్మార్పీఎస్ నెరవేర్చిందని అన్నారు.దేశంలో సామాజిక నిలువెత్తు నిదర్శనం కేవలం ఎమ్మార్పీఎస్ ఉద్యమం మాత్రమే అని అన్నారు.అంబేద్కర్ ఆశయాలు ఇంకా ఇప్పటికి సంపూర్ణంగా నెరవేరలేదని అన్నారు.సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతల నిర్మూలన కోసం, సాంఘిక వివక్షతను రూపుమాపడం కోసం భవిష్యత్తులో ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రయాణం కొనసాగిస్తుందని అన్నారు. సమాజహితం, సామాజిక న్యాయం, సమాజ సంక్షేమం కోసం అన్ని వర్గాల ప్రతినిధిగా ముందుకు సాగుతామని అన్నారు.ఎమ్మార్పీఎస్ ఉద్యమం కేవలం మాదిగల కోసం మాత్రమే పరిమితం కాలేదని అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడి ఆరోగ్యశ్రీ , పెన్షన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు,తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు,మహిళల రక్షణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సాధించామని అన్నారు.ఇకపై సమాజం పట్ల కృతజ్ఞతతో పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు.
. ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాతాళ్ళ రమేష్ మాదిగ
మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి
మాజీ జడ్పీటీసీ మెటపోతుల మనోజ్ గౌడ్ మాజీ ఎంపిడిఓ, కుమార్ స్వామి ఎంఎస్పి తడుగుల విజయ్ మాదిగ
ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కట్ల రాజశేఖర్ కళాకారులు డాక్టర్ శరత్ , జూపాక శివ, రేల కుమార్ మాజీ సర్పంచ్ లు సాట్ల రాజు పెరలా రాజు కొయ్యల ఈశ్వరమ్మా
అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కొయ్యల రాజు ఉపాధ్యక్షులు జన్ను రాజు మేకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.