Friday, February 14, 2025

సంగెం ఎంపిపి పై అవిశ్వాస తీర్మానం

*మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ని కలిసిన సంగెం మండల జడ్పీటిసి, ఎంపిటిసిలు..**

*కన్నతల్లి లాంటి బి.ఆర్.ఎస్. పార్టీకి నమ్మక ద్రోహం చేసి,అధికార దాహంతో పార్టీ మారుతున్న వారితో నష్టం లేదు..*

సంగెం ఎంపిపి పై అవిశ్వాసంపై చల్లా ధర్మారెడ్డి తో చర్చించామని.రేపే అవిశ్వాసం పెడుతున్నట్లు వెల్లడించిన జడ్పీటిసి,ఎంపిటిసిలు..
పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి పార్టీ మారిన వారితో బి.ఆర్.ఎస్.కు ఎలాంటి నష్టం లేదని జడ్పీటిసి గూడ సుదర్శన్ రెడ్డి,మండల అధ్యక్షులు పసునూరి సారంగపాణి ,సంగెం మండలం ఎంపిటిసిలు ఫోరం అధ్యక్షులు రంగరాజు నరసింహస్వామి,ఎంపిటిసిలు తెలిపారు.
గురువారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని వారి నివాసంలో సంగెం మండలం 11మంది ఎంపిటిసిలతో పాటు జడ్పీటిసి గూడ సుదర్శన్ రెడ్డి,
మండల అధ్యక్షులు పసునూరి సారంగపాణి లు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మండలంలో పస్తుత పరిస్థితులపై చర్చించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. పార్టీలో ఉంటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపిపి కందగట్ల కళావతి నరహరి పై అవిశ్వాసంపై చల్లా ధర్మారెడ్డి తో చర్చిoనట్లు వారు తెలిపారు.ఇన్ని రోజులు పార్టీలో ఉంటూ,పదవులు అనుభవిస్తూ పార్టీకి ద్రోహం చేసే చర్యలు చేపడితే సహించేది లేదని తెలిపారు. రేపే ఎంపిపిపై అవిశ్వాసం పెడుతున్నట్లు వారు తెలిపారు.
ఈ సమావేశంలో వైస్ ఎంపిపి బుక్క మల్లయ్య, ఎంపిటిసిలు రంగరాజు నరసింహస్వామి,గుగులోతు వీరమ్మ గోపిసింగ్, బానోత్ పద్మ శ్రీనివాస్,కట్ల సుమలత నరేష్,మెట్టుపల్లి మల్లయ్య,కొనకాని రాణి మొగిలి,గాయపు ప్రచూర్ణ భాస్కర్ రెడ్డి,బొమ్మ పావని యుగెందర్,సుతారి బాలకృష్ణ,అడ్డగట్ల దుర్గారావు,కో ఆప్షన్స్ ఎస్. కే మన్సూర్ అలీ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular