తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద వైద్యం ద్వారా మొండి వ్యాధులకు సులువుగా చికిత్స చేయడం దీని ప్రత్యేకత,సంగెం, మండలం. రామచంద్రాపురం, గ్రామంలో డైరెక్టర్ ఆర్, డి, డి, ఆయుష్ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గా ఉచితంగా ఆయుర్వేద వైద్య శిబిరం గ్రామ పంచాయతీ సచివాలయంలో గ్రామ ఆయుర్వేద వైద్య అదికారి డాక్టర్ కె, రాజేందర్ నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిరియాట్రిక్స్ క్యాంపు వృద్ధుల ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అందించడంపై దృష్టి సారించింది వైద్య ప్రత్యేక వృద్ధులలో వ్యాధిని నివారించడం గుర్తించడం మరియు చికిత్స చేయడం ద్వారా ఆరోగ్యాన్ని అందించడం దీని లక్ష్యం అని తెలిపారు, అలాగే గ్రామంలో 100 మంది వృద్ధులకు పరీక్షలు నిర్వహించి, వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్పి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు, ఈ క్యాంపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొంపల్లి దిలీపు రావు, డాక్టర్, క్రాంతికుమార్(పి, డి, ఎమ్, ఓ)ఆఫీసర్, ఏఎన్ఎం లు ఆశ వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సంగెం : ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించిన డాక్టర్ కె.రాజేందర్
RELATED ARTICLES