*అంతిమయాత్రలో పాల్గొని మృతి దేహాన్ని కి ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు*
**మాజీ ఎమ్మెల్యే చల్లా*
*ధర్మారెడ్డి.* *
*తేజ న్యూస్ టివి ప్రతినిధి. సంగెం.*
బిఆర్ఎస్ సీనియర్ ముఖ్య నాయకులు,వరంగల్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు తండ్రి నిమ్మగడ్డ సుబ్బారావు మంగళవారం రోజు సాయంత్రం మృతిచెందడం జరిగింది.విషయం తెలిసిన పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెంటనే సంగెం మండలం గుంటూరు పల్లి గ్రామానికి బయలుదేరి సుబ్బారావు పార్థీవ దేహాన్ని కి పూలమాలలు వేసి సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన బిఆర్ఎస్ నాయకులు,వివిధ పార్టీల నాయకులు వరంగల్ జిల్లా నాయకులు,అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్థీవదేహాన్ని పూల మాల వేసి నివాళులర్పించారు. అలాగే నిమ్మగడ్డ ను పరామర్శించి మనో దైర్యం చెప్పారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ
రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ మార్నెని రవీందర్ రావు,మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, సంగెం మండల బిఆర్ఎస్ పార్టీ పసునూరి సారంగపాణి, మాజీ రైతు విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకన్న , మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి.కార్యకర్తలు తదితరులు ఉన్నారు.