మామునూరు ఎయిర్ పోర్ట్ భూ సేకరణలో భూములు కోల్పోతున్న రైతులు అధైర్యా పడవద్దు.
ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి..
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
పరకాలనియోజకవర్గంపరిధిలోని ఖిలా వరంగల్ మండలం గుంటూరుపల్లి,గాడిపల్లి పరిధిలో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భూములు కోల్పోయే రైతుతో,ఎయిర్పోర్ట్ నిర్మాణ ఆవరణలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు
తొలిదశలో విమానాల రాకపోకలకు వీలుగా భూమిని సేకరించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు, ఆయా గ్రామాల రైతులతో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.వ్యవసారంగం పైన ఆధారపడి ఉన్న మధ్యతరగతి కుటుంబాలు మావని రైతులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకోవచ్చారు.
భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం ప్రకటించిన భూముల విలువ
తక్కువగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో,రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు.
గాడేపల్లి లో సుమారు 12 మంది ఇండ్లు కోల్పోతుండడంతో ,వారి ఇండ్లను సందర్శించి ఇంటి యజమానులకు తగు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.
భూములు కోల్పోతున్న అన్నదాతలు వరంగల్ పట్టణానికి చేరువలోనే ఉన్న గుంటూరు పల్లికి అతి సమీపంలోనే రహదారి పోయే విధంగా చూడాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు.