భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
21-1-2025
సంక్షేమ పథకాల అమల్లో రాజకీయ జోక్యం నివారించాలని సీ పి ఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం రాముడు వెంకటాచారి, అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం జాబు కార్డు, పని దినాలను పరిగణలోకి తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయటం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. చాలామంది పేదలకు కార్డు లేవని కొంతమంది ఉపాధి హామీ పనులకు కాకుండా వ్యవసాయ పనులకు ఇతర పనులకు వెళ్లే వారికి ఈ పథకంలో అన్యాయం జరుగుతుందని అన్నారు. లబ్ధిదారులను తగ్గించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. భూములేని పేదలందరికీ ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. గ్రామ సభలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. పథకాలు అమలులో అర్హులైన వారి పేర్లు జాబితా లేకపోతే గ్రామ సభల్లో నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు కనకయ్య ,కొక్కెరపా టీ పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్, మండల కన్వీనర్ పెద్దిన్నే వేణు, మండల కమిటీ సభ్యులు రామిరెడ్డి, కాకా సీత, షేక్ నాగుల్ మీరా,గాలి రామారావు, గోగుల తిరుమలయ్య, పి వీర భద్ర రావు ,ఇప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.