బుచ్చిరెడ్డిపాళెం జులై 06 తేజ న్యూస్ టీవీ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పనిచేస్తున్నారని టిడిపి మండల ఇంచార్జి అడపాల శ్రీధర్ రెడ్డి తెలిపారు. కోవూరు ఎమ్మెల్యే వేమి రెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు పార్లపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడపాల శ్రీధర్ రెడ్డి గడపగడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాలను ఫోన్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారం లోనికి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం, కాలువల పూడికతీత, అర్హులైన వారికి పెన్షన్లు, గోశాల నిర్మాణం వంటి అనేక పనులు ఏడాది కాలంలో జరిగాయన్నారు. బూత్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే చేస్తున్న మంచి పనులను ప్రజల్లోనికి తీసుకొని పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అడపాల జనార్దన్ రెడ్డి, ఉచ్చూరు సుదీప్ రెడ్డి, వేగురు చంద్రారెడ్డి, రామిశెట్టి వెంకటేశ్వర్లు, పూండ్ల ఏసోబు, వెంకట రమణయ్య, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్న కోవూరు ఎమ్మెల్యే
RELATED ARTICLES