డోన్ పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీ నందు ఆంధ్రప్రదేశ్ మహిళ సమాఖ్య నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. షేమిమ్ బేగం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు.
ఈ ముగ్గుల పోటీలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులను వేశారు.
ఈ పోటీలకు ముఖ్య అతిదులుగా డోన్ డీఎస్పీ శ్రీనివాసులు సతీమణి షీలా సౌజన్య, రూరల్ సీఐ రాకేష్ సతీమణి మాధవి లు హాజరై న్యాయ జడ్జీలుగా వ్యవహరించారు.
ఈ ముగ్గుల పోటీలలో మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి న్యాయ నిర్ణేతలు మొదటి విజేతగా కావ్య (బహుమతి కుకుమా భరణీలు),రెండవ విజేతగా అనిత(బహుమతి గ్రైండర్), మూడవ విజేత నవీన (కిచెన్ సెట్) లను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలను షేమిం వారి మిత్ర బృందం శాలువాలు మేమంటోలతో సత్కరించారు.
ఈ ముగ్గుల పోటిలతో శ్రీరామ్ నగర్ కాలనీ అంత పండుగా వాతావరణంతో ఆహ్లాదకరంగా మారింది.
ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలు మాట్లాడుతూ డోన్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఈ పోటీలను నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగను కళ్ళకు కట్టినట్లు చూపించే ముగ్గులను వేసిన మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోటీలను నిర్వహించిన షేమిమ్ వారి మిత్ర భృందన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మహిళ నాయకులు అమృత రెడ్డి,శిరిన్,మాధవి,షబానా, సూర్య పద్మావతి,మాధవీలత, డోన్ పట్టణ మహిళలు పాల్గొన్నారు.
షేమిమ్ బేగం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా మహిళలకు ముగ్గుల పోటీలు
RELATED ARTICLES