TEJA NEWS TV
బీసీ ,ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ శాఖల ముఖ్య సలహాదారుగా నియమితులైన మాజీ మంత్రి షబ్బీర్ అలీని మాందాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందన్నారు. హైదరాబాదులోని మాజీమంత్రి నివాసానికి వెళ్లి పూలమాలలు వేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. షబ్బీర్ అలీ కి ముఖ్య సలహాదారు పదవి రావడంతో కామారెడ్డి ప్రాంతం అభివృద్ధి పథంలో పయనించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో భూమా గౌడ్, అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, మధుసూదన్ రెడ్డి ,రాకేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లు పాల్గొన్నారు.
షబ్బీర్ అలికి సలహాదారు పదవిని రావడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తల హర్షం
RELATED ARTICLES