*తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.*
సీతారాముల కల్యాణోత్సవం బుధవారం పరకాల పట్టణం లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగింది. సీతారాముల కల్యాణానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం దేవస్థానం ఆవరణలో కల్యాణవేదికపై ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం మంత్రోచ్ఛ రణల మధ్య ఘనంగా కల్యాణం నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని వందలాది భక్తజనం కన్నులారా వీక్షించి తరించారు.
మొదటగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులను ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలో పూజలు నిర్వహించారు.కళ్యాణోత్సవం అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు.ఈ కార్యక్రమంలో ప్రజలు వివిధ నాయకులు తండోపతండాలుగా శ్రీరామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
శ్రీ సీతారాముల కల్యాణం హాజరై పట్టు వస్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు
RELATED ARTICLES