TEJA NEWS TV TELANGANA
జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన డైనమిక్ పోలీస్ అధికారి శ్రీ సబ్బటి విష్ణుమూర్తి (ACP) గారు అకస్మాత్తుగా గుండెపోటుతో హైదరాబాదులో మంగళవారం ఉదయం మరణించారు. ఆయన మరణ వార్త స్థానిక ప్రజలలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.
శ్రీ విష్ణుమూర్తి గారు జూలూరుపాడు మండలానికి చెందినవారు. ప్రజలతో నికటంగా మమేకమై, సమర్థవంతమైన విధానాలతో ప్రజాసేవలో విశేష కృషి చేశారు. ఆయన సేవలు, నిబద్ధత, ప్రజలతో ఉన్న అనుబంధం ఈ ప్రాంత ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
అంత్యక్రియలు వివరాలు: 📅 తేదీ: మంగళవారం, 07-10-2025 🕙 సమయం: ఉదయం 10:00 గంటలకు 📍 స్థలం: జూలూరుపాడు మండలం
జూలూరుపాడు మండల ప్రజలు మరియు కుటుంబ సభ్యుల తరఫున, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా ప్రార్థిస్తున్నాము. 🙏 ఓం శాంతి 🙏




