Monday, January 20, 2025

శ్రీ సత్యసాయి జిల్లా: 26 సంవత్సరాలు క్రితం జరిగిన మిస్టరీ కేసును చేదించిన మడకశిర పోలీసులు

TEJA NEWS TV

శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం దిన్నేహట్టి గ్రామంలో ఇరవై ఆరేళ్ళ క్రితం భార్యపై అనుమానం తనకు పుట్టిన వాడు కాదని పిల్లవాడిని గొంతు నలిమి చంపిన కసాయి తండ్రి.
పెళ్లి కార్డు తో ముద్దాయి ఆచూకీలబ్యం..

ఈ మిస్టరీ హత్య కేసు చేదింపులో  ప్రతిభ చూపిన మడకశిర పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీమతి వి.రత్న

మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు గారు, పెనుగొండ డిఎస్పి వెంకటేశ్వర్లు,
సిఐ రాజ్ కుమార్ , గుడిబండ సబ్ ఇన్స్పెక్టర్ A.మునిప్రతాప్ తో కలిసి కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్‌పి … వి.రత్న.
సంఘటన జరిగిన తేదీ : 2.10.1998
   ఫిర్యాదు చేసిన తేదీ : 18.10.1998 తేదిన కరియమ్మ తనభర్త తిప్పేస్వామిపై గుడిబండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అతనిపై గుడిబండ పోలీసులు కేసు నమూదు చేయడం జరిగినది.

           మిస్టరీగా మారిన పాత కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి తప్పించుకు తిరుగుతున్న       ముద్దాయిలను అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీమతి వి.రత్న ఆదేశించారు.
దీంతో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు  రివ్యూ చేసి,
దీంతో పెనుగొండ సబ్ డివిజన్లో మిస్టరీగా మారిన కేసులపై డిఎస్పి వెంకటేశ్వర్లు దృష్టి సారించి దర్యాప్తు చేపట్టి కేసుల చేదింపులో పురోగతి సాధించారు.
కేసు నేపథ్యము:-
26 సంవత్సరాల క్రితం …..
గుడిబండ మండలం, దిన్నేహట్టి గ్రామస్తుడు గొల్ల చిత్తప్ప కొడుకు గొల్ల తిప్పేస్వామికి ఇప్పటికి 30 సం.ల క్రితం అదే గ్రామస్తురాలు తన మేనత్త పట్టేమ్మ కూతురు కరియమ్మతో వివాహం అయివుండి, వారికీ ఇద్దరు కొడుకులు సంతానం కలిగిఉండి, తిప్పేస్వామి తన భార్య కరియమ్మ, ఏప్రిల్ నెల, 1998 సం.లో తన రెండవ కొడుకు శివ లింగయ్యకు ప్రసవించింది అని, తిప్పేస్వామికి తన భార్య కరియమ్మ ప్రవర్తనపై అనుమానం ఉండి, తన చిన్న కొడుకు శివ లింగయ్య తనకు పుట్టలేదని

అనుమానంతో తన చిన్నకొడుకు శివ లింగయ్య, వయస్సు 6 నెలలు అను చిన్న పిల్లవాడిని ఎలాగైనా చంపాలని అనుకుని ఉండి, సమయం కోసం ఎదురుచూస్తూ ఉండి 02.10.1998 వ తేది ఉదయం 6.00 గంటలపుడు దసర పండుగ సందర్బంగా తన గ్రామం దిన్నేహట్ట్టిలో మారెమ్మ జమ్మికట్ట వద్ద వారి కులాచారం మేరకు ప్రదక్షిణలు చేయుటకు తన భార్యతో  చెప్పి ఆమెను నమ్మించి తన భార్యను, చిన్న కొడుకు శివలింగయ్యను దిన్నేహట్టి దగ్గర పొలాలలో ఉన్న మారెమ్మ జమ్మికట్ట వద్దకు పిలుచుకునిపోయి అక్కడ తన భార్య కరియమ్మ తన కొడుకు శివలింగయ్యను ఎత్తుకుని జమ్మికట్ట చుట్టూ పదక్షిణలు చేస్తూ ఉండగా

అప్పుడు తన భార్య ఎత్తుకున్న తన చిన్న కొడుకు శివలింగయ్య ను బలవంతంగా లాక్కుని పరిగెత్తి తన తండ్రి చిత్తప్ప  మామిడి తోట వద్దకు పోయి అక్కడ తిప్పేస్వామి తన కొడుకు శివలింగయ్యను గొంతు పిసికి చంపి అక్కడే గుంత తవ్వి పూడ్చి వేసి సాక్ష్యం లేకుండ చేసి పారిపొయినాడు.

పై విషయం గురించి కరియమ్మ 18.10.1998 తేది తనభర్త తిప్పేస్వామిపై గుడిబండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా 

గుడిబండ పోలీసు వారు హత్య కేసు నమోదు చేసి, అప్పటి నుండి  ముద్దాయి పరారీలో ఉన్నాడు.

ముద్దాయి :

గొల్ల తిప్పేస్వామి @ క్రిష్ణగౌడ, వయస్సు 55 సంవత్సరాలు S/o చిత్తప్పగారి చిత్తప్ప, దిన్నెహట్టి గ్రామం H/o మందలపల్లి గుడిబండ మండలం, ప్రస్తుత పేరు కృష్ణ గౌడ, వయస్సు 55 సంవత్సరాలు S/o జవరప్ప, ప్రస్తుత నివాసం న్యామనహళ్లి గ్రామం, మావినకెరె పంచాయతి, హలేకోటే హోబులి, హోలెనరసిపుర తాలుకా, హసన్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం,
ముద్దాయి అరెస్ట్ గురించి:
గొల్ల తిప్పేస్వామి  @ కృష్ణ గౌడ్ ఈదినం అనగా 25 .11.2024 తేది ఉదయాన్నే దిన్నేహట్టి గ్రామనికి వచ్చి తన తమ్ముడు చిత్తప్ప, తన చెల్లెలు కేంచమ్మలతో కలిసి భూమి బాగపరిష్కారాల గురించి అడిగి తరువాత మందలపల్లికి పోయి తనకు తెలిసిన పెద్దమనుష్యులతో భూమి బాగ పరిష్కరాల గురించి అడుగుదామని మందలపల్లి బస్సు స్టాండ్ వద్ద ఉండగా ఈ దినం ఉదయం 10.00 గంటలకు మడకశిర CI రాజ్ కుమార్, గుడిబండ SI వారి సిబ్బందితోపాటు మందలపల్లికి పోయి గొల్ల తిప్పెస్వామిని అరెస్టు చేసి, తన భార్య కరియమ్మ, తమ్ముడు చిత్తప్ప, చెల్లెలు కేంచమ్మలచే సదరు గొల్ల తిప్పెస్వామిని గుర్తింపు చేయించినారు. అరెస్టు చేసిన ముద్దాయి తిప్పెస్వామిని రిమాండ్ నిమిత్తం ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం అయినది.

చాలాకాలం నుండి ముద్దాయి హాజరుకోసం మడకశిర కోర్టులో పెండింగులో ఉన్న కేసులో సుమారు 26 సం.ల నుండి తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయి తిప్పెస్వామిని చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసిన మడకశిర సర్కిల్ ఇన్స్పెక్టర్ A రాజ్ కుమార్, గుడిబండ SI, ముని ప్రతాప్ మరియు వారి సిబ్బందిని, జిల్లా ఎస్పీ శ్రీమతి విరత్న పెనుగొండ డి.ఎస్.పి వెంకటేశ్వర్లు అభినందించి వారికి తగిన రివార్డులు అందజేశారు.

నేరం చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరు.. జిల్లా ఎస్పీ

నేరం చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ శ్రీమతి వి .రత్న తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular