Friday, January 24, 2025

శ్రీ శుఖ శ్యామలాంబ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ 


నందిగామ పట్టణంలోని శ్రీ శుఖ శ్యామలాంబ సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ 

ఈ రోజు సాయంత్రమే అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం.. పారువేట మండపం వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శివాలయం ప్రధాన ద్వారం వద్దకు భక్తులతో కలిసి రథాన్ని తీసుకువచ్చిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ 

మా ప్రభుత్వ హయాంలో స్వామి వారికి నూతన రథాన్ని తయారు చేయించే భాగ్యం మాకు కల్పించినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం.. ప్రత్యేక శ్రద్ధతో.. భక్తితో రథానికి ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దాం : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

పశ్చిమ కృష్ణా లోనే నందిగామ శివాలయం రథం తిరునాళ్లకు ఎంతో విశిష్టత ఉంది.. నేడు రాత్రి 07:00 గంటల నుండి పట్టణ పురవీధుల్లో రథంపై ఊరేగింపుగా స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఈ రథం తిరునాళ్లలో పాల్గొనడం జరుగుతుంది ..

*సాయంత్రం నిర్వహించనున్న రథోత్సవానికి ఎటువంటి అవాంతరాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని.. పోలీస్ -ట్రాఫిక్ పోలీస్ – విద్యుత్ శాఖ సిబ్బంది – ఆలయ అధికారులు, కమిటీ – ఆలయ పండితులు సమన్వయంతో.. రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించాలని సూచించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..*

సాయంత్రం స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. ప్రత్యేక చర్యలు తీసుకోవాలని.. ఆలయంలో తాగునీటిని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

*ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular