ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ భారతి విద్యా మందిరం ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాల సమితి అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది బి .నీలకంఠేశ్వరం మరియు పాఠశాల అధ్యక్షులు, ప్రముఖ పారిశ్రామికవేత్త టి ఎం సి వేణుగోపాల్ లు పాల్గొని మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య, నైతిక విలువలను శ్రీ సరస్వతీ విద్యాపీఠం పాఠశాలలలో అందించి చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం జరుగుతుందని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె . సావిత్రమ్మ మాట్లాడుతూ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.తమ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులు పోషకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చిన్నారులచే ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామలింగేశ్వర, రామలింగారెడ్డి ప్రసాద్ ,సుధాకర రావు గంగాధర్ పాఠశాల పూర్వ విద్యార్థులు పాఠశాల పోషకులు ఆచార్య బృందము తులసి, ఉమా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీ భారతి విద్యా మందిరం పాఠశాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES