*శ్రీ పాండురంగ స్వామి దేవాలయ అభివృద్ధికి సహకరిద్దాం*
*ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా వి యుగంధర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక*
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలోని శ్రీ శ్రీ పాండురంగ స్వామి దేవాలయ అభివృద్ధి కోసం నేడు కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆలయ నూతన కమిటీ చైర్మన్గా ఉల్పాల యుగంధర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఆలయ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఆయనకు ఇచ్చిన పదవిని కట్టుబడి పని చేస్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అనంతరం నూతన కమిటీని గ్రామ పెద్దలు శాలువాతో సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు వినయ్ కుమార్ రెడ్డి ఆనంద్ గౌడ్, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, ఆలయ కమిటీ పురోహితులు శ్రీధర్ జోషి, గౌరవాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పద్మ వెంకటేశ్వర రెడ్డి, గ్రామ పెద్దలు నారాయణరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి భగవంతు రెడ్డి ప్రతాపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జక్కన్న గారి బాల్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గడ్డం భీమన్న గజేంద్ర రెడ్డి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ పాండురంగ స్వామి ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా యుగంధర్ రెడ్డి
RELATED ARTICLES