TEJA NEWS TV TELANGANA
మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో స్థానిక శ్రీ కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థినిలు ఉపాధ్యాయులు, తెలంగాణలో అన్ని పండుగల్లో బతుకమ్మ పండుగ చాలా ప్రాముఖ్యమైనటువంటిది ముందస్తుగా ఆ పండుగను విద్యార్థిని ,ఉపాధ్యాయులు పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థినీలు సాంప్రదాయ దుస్తులు ధరించి అనేక మైనటువంటి వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరించడం జరిగింది .మన తెలంగాణ సాంస్కృతిలో భాగంగా బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది . సాంప్రదాయ బతుకమ్మ చరిత్రను తెలియజేసేటటువంటి సాంప్రదాయ పాటలతో ఆడుతూ బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఇట్టి బతుకమ్మ వేడుకల్లో ప్రిన్సిపాల్ రామకృష్ణన్, పాఠశాల డైరెక్టర్స్ పి నాగరాజు, డి రేణుక లింగమూర్తి మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
శ్రీ కృష్ణవేణి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
RELATED ARTICLES



