శ్రీసిటీ, మార్చి 24, తేజన్యూస్ టీవీ
శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో శ్రీసిటీలోని ఎన్ ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ పరిశ్రమ, తమ కార్పొరేట్ సామాజిక భాద్యత చర్యల్లో భాగంగా సత్యవేడులోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ (ప్రభుత్వ గురుకుల పాఠశాల) కు లక్ష రూపాయల విలువ చేసే వంట సామాగ్రిని వితరణ ఇచ్చింది. శనివారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సామాగ్రిని స్కూల్ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులకు అందచేశారు. వితరణ పట్ల ఎన్ ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ మరియు శ్రీసిటీ యాజమాన్యానికి పాఠశాల సిబ్బంది కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ పరిశ్రమ అధికారులు మల్లీశ్వరన్, మహేష్, సాయి కృష్ణశ్రీ, లక్ష్మి, శ్రీసిటీ ప్రతినిధులు వై.రమేష్, సురేంద్ర కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీసిటీ పరిశ్రమచే సత్యవేడు గురుకుల పాఠశాలకు వంట సామగ్రి వితరణ
RELATED ARTICLES