Friday, January 24, 2025

శ్రీసిటీలో శ్రీవాణి ఉగాది పురస్కారాల వేడుక



పలువురి ప్రముఖులకు పురస్కారాల ప్రదానం

శ్రీసిటీ, ఏప్రిల్ 27 ( తేజన్యూస్ టీవీ )

తెలుగు ఉగాదిని పురస్కరించుకుని యేటా శ్రీసిటీలో నిర్వహించే ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని శనివారం అత్యంత వేడుకగా నిర్వహించారు. శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో స్థానిక బిజినెస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందచేశారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చేతుల మీదుగా శ్రీవాణి ప్రతిష్టాత్మక ఉగాది సంగీత పురస్కారాన్నిటిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రసిద్ద గాయకులు కె.సరస్వతీ ప్రసాద్ గారు, సాహిత్య పురస్కారాన్ని కవి, సాహితీవేత్త బుచ్చినాయుడుకండ్రిగ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు యువశ్రీ మురళి గారు, ఆధ్యాత్మిక పురస్కారాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వక్త మరియు అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబల ఆధ్యాత్మిక రచనల పరిశోధకులు గంధం బసవ శంకరరావు, పాత్రికేయ పురస్కారాన్ని తిరుపతికి చెందిన మాజీ హిందూ విలేకరి ఎ.దేవరాజన్ అందుకున్నారు.పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన రవీంద్ర సన్నారెడ్డి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా ఎదుగుతున్న శ్రీసిటీ, మంచి నివాసయోగ్య ప్రాంతంగా రూపుదిద్దుకునే క్రమంలో కళలను ప్రోత్సహిస్తూ శ్రీవాణి ఆధ్యాత్మిక సాహిత్య వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ ప్రతినెలా నిర్వహించే శ్రీవాణి కార్యక్రమాల్లో శ్రీసిటీ పరిధిలోని ఉద్యోగులు, గృహిణిలు, విద్యార్థులు, ప్రజలు చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఉగాది పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ పారిశ్రామికవాడలో శ్రీవాణి వేదిక ద్వారా ఆధ్యాత్మిక సాహిత్య కార్యక్రమాలను చేపట్టడం పట్ల శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డిని అభినందించారు. తమ ప్రతిభను గుర్తించి ఉపాధి పురస్కారాలకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా తిరుపతి ఎస్వీ సంగీత నృత్య  కళాశాల బృందంచే సాగిన సంగీత విభావరి సభికులను ఎంతగానో అలరించడంతో పాటు ప్రశంసలు అందుకుంది. సంగీత బృందంలో వడలి లక్ష్మి (ఫ్లూట్), సంకీర్తి కుమార్ (వయోలిన్), కృష్ణవంశీ (మృదంగం), దివిష్ చంద్ (ఘటం) పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీసిటీ డీఎస్పీ పైడేశ్వర రావ్, సీఐ భాస్కర్, శ్రీసిటీ ఉద్యోగులు, గృహిణిలు, సూళూరుపేట, శ్రీహరికోట నుంచి పలువురు సాహిత్య ప్రియులు పాల్గొన్నారు. శ్రీసిటీ పీఆర్వో పల్లేటి బాలాజీ కార్యక్రమ ప్రయోక్తగా వ్యవహరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular