అనంతపూర్ జిల్లా,కళ్యాణదుర్గం సెట్టూరు మండల పరిధిలోని చెర్లోపల్లి ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం ప్రధాన పైప్లైన్ పగిలిపోయింది. తద్వారా పైప్లైన్ పగిలి నీరంతా పైకి ఎగిసిపడుతుంది. ఆ నీరు అంతా వృధాగా సరఫరా అవుతుంది అని ఆ గ్రామస్తులు తెలిపారు. గతంలోనూ నీ ప్రధాన పైప్లైన్ కు పగిలిన చోటే రెండోసారి పగలడం శోచనీయంగా ఉంది. ఈ పైప్ లైన్ కు మరమ్మతులు నాణ్యంగా చేయాలని ఆ గ్రామస్తులు అధికారులను కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పగిలిపోయిన శ్రీరామ్ రెడ్డి ప్రధాన పైప్లైన్ మరమతలు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.
శ్రీరామ్ రెడ్డి ప్రధాన పైప్లైన్ పగిలి.. ఎగిసిపడుతున్న నీరు
RELATED ARTICLES