TEJA NEWS TV : అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి డివిజన్ లోగల శ్రీరామ్ నగర్ కాలనీ తారానగర్ విద్యానికేతన్ స్కూల్ ఆవరణలో హుడా ట్రేడ్ సెంటర్ లోని రామాలయంలో బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం నేపథ్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ విచ్చేసి రామనామ స్మరణకు పాత్రులయ్యారు అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ నిర్వాహకులు కార్పొరేటర్ శాలువా కప్పి శ్రీ సీతారాముల చిత్రపటం ఇచ్చి ఘనంగా సత్కరించారు ఈ సందర్బంగా రామాలయంలో నిర్వహించిన శ్రీ రామ యజ్ఞంలో పాల్గొన్నారు శ్రీరామ్ నగర్ కాలనీలో నూతనంగా చేపడుతున్న కమాన్ ఏ ఆర్ సి హెచ్ ను స్థానిక నాయకులతో అసోసియేషన్ సభ్యులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూగత 500 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న మన అయోధ్యలో రామయ్య దేవాలయ స్థలములో యావత్ భారత దేశ హిందువులు అందరూ కలిసి నూతనంగా నిర్మించుకున్న దివ్య ఆలయంలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ను పురస్కరించుకొని ఇక్కడ మీ అందరి మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కార్పొరేటర్ పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్ సీనియర్ నాయకులు బద్దం కొండల్ రెడ్డి పవన్ కుమార్ మహేష్ గోపాల్ యాదవ్ గడ్డం రవి యాదవ్ బస్వరాజ్ కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ బుచ్చి రెడ్డి పవన్ సుభాష్ రాథోడ్ సాయినందన్ రవికిరణ్ రంజిత్ సుశాంత్ ఆలయ సంబంధిత నిర్వాహకులు తదితర కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
శేరిలింగంపల్లి: బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం నేపథ్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు
RELATED ARTICLES