కళ్యాణదుర్గం,శెట్టూరు తేజ టీవీ న్యూస్
మండల నూతన తహసీల్దార్ గా సోమవారం సి.శ్రీదేవి పదవీ బాధ్యతలు చేపట్టారు. తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలం నుంచి బదిలీపై శెట్టూరు తహసీల్దారుగా వచ్చారు. తహసీల్దార్ కు రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. తహసీల్దారు మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ప్రజలకు, రైతులకు, గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ మహేశ్వర్ రెడ్డి రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు
శెట్టూరు తహసీల్దార్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సి.శ్రీదేవి
RELATED ARTICLES