TEJA NEWS TV : హొళగుంద మండల కేంద్రంలో శివ స్వాముల శివభక్త మండలి ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే సామూహిక వివాహలలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈనెల 22 మరియు 23 వ తేదీలలో నిర్వహించు సామూహిక వివాహాలనిర్వహణ కొరకు మాజీ తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యేట శేషగిరి 5000/- రూపాయల విరాళాన్ని హొళగుంద శివభక్త మండలి భక్తుల బృందానికి అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.
తదనంతరం చిన్నహ్యేట శేషగిరి గారు మాట్లాడుతూ శివ స్వాములు ఎంతో భక్తి నిష్ఠలతో శివ మాలాధారణ చేసి, సదరు ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక బాధ్యతగా సామూహిక వివాహల నిర్వహణకు పూనుకోవడమే కాక ఆ సేవా సంకల్పాన్ని ప్రతి ఏటా కలిసికట్టుగా పాటించి కొనసాగించడం హర్షించదగ్గ ఆదర్శ కార్యక్రమమన్నారు.
శివస్వాములు జమ్మన్న సిద్ధలింగ మౌనేష్ ఆచారి మరియు శివ భక్తమండళి మాలాధారులు మాట్లాడుతూ అడిగిన వెంటనే గొప్ప మనసుతో సామూహిక వివాహాలకు విరాళాన్ని అందించి సేవా కార్యక్రమాలకు తమ తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని విశ్వాసాన్నిచ్చిన చిన్నహ్యేట శేషగిరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు దుర్గయ్య, తోక వెంకటేష్, కురువ మల్లికార్జున, శివ స్వాముల బృందం తదితరులు పాల్గొన్నారు.
