

TEJA NEWS TV
ప్రభుత్వ ఇచ్చిన హామీల అమలు తోనే,ముదిరాజులకు అసలైన అభివృద్ధి సాధ్యమని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు. బిబిపేట్ మండల్ ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు
పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా పలు గ్రామాల్లోనీ పూజ కార్యక్రమాల్లో పాల్గొని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ మాట్లాడారు.
పెద్దమ్మ తల్లి.. పండగలు.. సంస్కృతి సాంప్రదాయాల నిర్మాణం… గ్రామ గ్రామాన,ముదిరాజ్ జండాలను ఆవిష్కరణతో చైతన్యం,ఏర్పడింది. దీంతో పాటే ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల,ఏర్పాటుకు నిరంతర పోరాటం చేయడంతో నేడు ఫలితాలను ఇస్తుంది. పెద్దమ్మ తల్లి ఆలయాల నిర్మాణం,ఉమ్మడి జిల్లాలో(కామారెడ్డి-నిజామాబాద్) చురుకుగా,సాగుతున్న తీరుకు నిదర్శనం.
ముదిరాజ్ ల సాంప్రదాయం, సంస్కృతి నిర్మాణం ఒక్కవైపు వృద్ధి సాధిస్తూ… ” *మేమెంతో- మాకంత* అనే వాట కోసం రాజ్యాంగ స్ఫూర్తి తో..ధర్మ యుద్ధ పోరాటం చేస్తూనే ఉన్నాం.న్యాయస్థానాల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ,తిరుగుతూ చట్టపరమై ఆర్థిక,రాజకీయ విద్యా ఉపాధి వాటకై..కోట్లాడడంలో, ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ క్రియాశీలకంగా వ్యవహరించింది. మరోవైపు వ్యూహాత్మక విధానంతో. విద్యా ఉపాధి అవకాశాల కోసం BC”A”అమలుతో విద్య,ఉద్యోగాలలో సరైన వాట కై – నా ఘర్షణ..మా సంఘర్షణ.(ఐక్యంగా)అని చాలాసార్లు జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ వివరించారు.
తరం..తరం..నిరంతరం..తరతరాల అణిచివేత పై అలుపెరగని ఉద్యమ బావుట ను ఎగురవేస్తూ.. ముదిరాజ్ జాతి చైతన్యానికి ఆయన నిదర్శన గా నిలిచారని పలువురు అభిమానులు కొనియాడారు.
మత్స్య శాఖలో సభ్యత్వాలు సాధనే లక్ష్యంగా – – ప్రభుత్వం పై ఒత్తిడే… నా పంతం’అని ధర్నాలతో,పెద్దఎత్తున నిరసన ర్యాలీలతో,ఊరేగింపులతో,రాస్తారోకోలతో,బహిరంగ సభలతో, కలెక్టర్, రెవెన్యూ కార్యాలయాల ముట్టడితో ముదిరాజ్ ల పక్షాన నిలబడి పోరాడుతున్న విషయం,అందరికీ తెలిసిందే. చరిత్రనుతిరగేస్తూ
డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్,చేస్తున్న ఉద్యమం అందరికీ స్ఫూర్తి దాయకం. నిస్వార్ధంగా మొదటి నుండి నేటి వరకు”జాతి కోసం “కాలుకు గజ్జ కట్టుకునీ తిరిగుర్తుతున్న విజేత విట్టలన్న” అని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాణ బెస్త కొనియాడారు.
ఈ కార్యక్రమంలో లింగంపేట మండల అధ్యక్షులు సాయికుమార్ ముదిరాజ్ , సంద బాలయ్య ముదిరాజ్,కిషన్ ముదిరాజ్, రవి ముదిరాజ్,గంగయ్య ముదిరాజ్ , కరుణాకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు నేను